మనకూ ఓ రోజు వస్తది..అప్పుడు సీఎం అవుతా.. టైమొస్తే దేవుడు కూడా నన్ను ఆపలేడు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

మనకూ ఓ రోజు వస్తది..అప్పుడు సీఎం అవుతా.. టైమొస్తే దేవుడు కూడా నన్ను ఆపలేడు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 
  • పార్టీ బలోపేతానికి ఇతర పార్టీల వారిని తీసుకుంటే ఓకే.. మమ్మల్ని వెళ్లగొడ్తాం అంటే ఊరుకోం 
  • రాష్ట్రంలో మళ్లీ వచ్చేది రాజశేఖర్ రెడ్డి యుగమే: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

నల్గొండ/నార్కెట్ పల్లి, వెలుగు: ‘మనకూ ఓ రోజస్తది, సమయం వస్తే ముఖ్యమంత్రి అవుతా.. ఆ టైమొస్తే బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు’అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా నార్కట్‌‌‌‌‌‌‌‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంలలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగా.. కార్యకర్తలు సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. స్లోగన్స్‌‌‌‌‌‌‌‌కు స్పందిస్తూ.. భవిష్యత్తులో దేవుడి దయతో తనకు అవకాశం వస్తే ఎవరూ ఆపలేరన్నారు.

ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అవమానం జరుగుతోందని, బయటి నుంచి వచ్చినోళ్లు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను కబ్జా చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీని వదిలిపోయే పరిస్థితి వచ్చిందని, కీలక నేత చిన్నారెడ్డికి అవమానం జరుగుతోందన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ లాంటి వారిని ఎందుకు తీసుకుంటున్నారని నిలదీశారు. పార్టీని బలోపేతం చేసేందుకు ఇతరులను చేర్చుకుంటే తప్పు లేదని, కానీ, ఎంతోకాలంగా కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలను వెల్లగొడ్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. 

మంత్రి పదవిపై అధిష్టానానిదే నిర్ణయం..

ఎన్నికల సమయంలోనే హైకమాండ్ తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని, అయితే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని రాజగోపాలరెడ్డి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడమే తన లక్ష్యమని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను రెండోసారి అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడతానని చెప్పారు. ఎన్నో ఏండ్లుగా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను నమ్ముకున్న నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూస్తానన్నారు.

వచ్చే ఎన్నికల్లో తన శక్తినంతా ఒడ్డి బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ను అడ్డుకుంటానన్నారు. తెలంగాణలో వైఎస్‌‌‌‌‌‌‌‌ రాజశేఖర్ రెడ్డికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారని, ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన తాను చివరి వరకు వైఎస్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశయాల కోసం పని చేస్తానని చెప్పారు. తాము వైఎస్సార్‌‌‌‌‌‌‌‌ నిజమైన శిష్యులమని రాజ్‌‌‌‌‌‌‌‌గోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో వచ్చేది రాజశేఖర్​రెడ్డి యుగమేనని, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను గెలిపించి రాజన్న రాజ్యం తెస్తామన్నారు.